![]() |
![]() |

బుల్లితెర మీద "కార్తీక దీపం" సీరియల్ లో హిమ రోల్ లో అమాయకపు అమ్మాయి పాత్రలో నటించింది కీర్తి భట్. ఇప్పుడు "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తోంది. కీర్తి భట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కి ఆమె గురించి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 6 లో ఆమె తన గురించి మొత్తం చెప్పేసింది. తన జీవితంలో వున్న విషాదాన్ని పంచుకోవడంతో ఆడియన్స్ కి ఆమె ఇంకా బాగా దగ్గరయ్యింది. కీర్తిభట్ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు పిల్లలంటే చాల ఇష్టం కూడా. అలా తన ఫోటో షూట్స్ తో పాటు తన సీరియల్ లో నటించే పిల్లాడితో ఎన్నో ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అలాంటి కీర్తి ఇప్పుడు మాట్లాడుకుందాం రండి అంటూ ఫాన్స్ ని పిలిచింది. ఇక వాళ్ళు ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగారు.."మీ ఫింగర్స్ ఎలా ఉన్నాయి అక్కా" "అలాగే ఉన్నాయి నో చేంజెస్" అంటూ తన చేతివేళ్ళ ఫోటోని పోస్ట్ చేసింది. "నటి కాకపోయి ఉంటే ఏం అయ్యేవారు" అనేసరికి "టీచర్" ని అని చెప్పింది. "మీకు ఇష్టమైన ప్లేస్" "మా ఇల్లు" " బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది" "గుడ్ బాగుంది" "మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు" "ఇంకెవరూ మీరే" అంటూ దర్శన్ భరద్వాజ్ అనే పేరును టాగ్ చేసింది. "ప్రశ్నలు అడిగినా మీరు రిప్లై ఇస్తారా" అని ఒక ఫ్యాన్ అడగడంతో "ఇవ్వడానికి ట్రై చేస్తాను" అని చెప్పింది కీర్తి భట్..ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాకా తన లైఫ్ లో జరిగిన ఘోర సంఘటనను, తనవాళ్లందరినీ పోగొట్టుకున్న తీరుని వివరించి చాలా బాధపడింది. తనలాంటి పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక కీర్తి 2017 లో రూపొందిన కన్నడ చిత్రం 'ఐస్ మహల్' తో ఈమె నటిగా మారింది.
![]() |
![]() |